ఒకే కథకి ఇద్దరు ఉద్దండులైన చిత్రకారులు గీసిన బొమ్మలు ఎలా వున్నాయో క్రింద చూడండి. ఆ ఇద్దరిలో ఒకరు చందమామ పత్రికకి సొగసులద్దిన శంకర్ గారైతే ఇంకొకరు అమరచిత్రకథ వారి కామిక్ పుస్తకాలూ, మరియు పిల్లల మాస పత్రిక టింకిల్ లో బొమ్మలు గీస్తూ పాఠకుల అభిమానాన్ని చూరగొన్న ప్రదీప్ సాథే గారు. అమరచిత్రకథ వారి 'స్నేహితులు – శత్రువులు' అనే పుస్తకంలో 'ముని – కుక్క' అనే కథగా ప్రదీప్ గారు గీస్తే, శంకర్ గారు రామకృష్ణమఠం వారి ప్రచురణ ’బాలల కథా మంజరి’ అనే పుస్తకాలలో(మొత్తం ౧౬ పుస్తకాల సెట్) 'దుష్టుల స్వభావం' అనే కథకి చిత్రించారు.
అర్హతలేనివారిని అందలమెక్కిస్తే పర్యవసానాలెలా వుంటాయో చెప్పే కథ ఇది. కథ స్థూలంగా… అంటూ నేను మొదలెట్టేకన్నాక్రింది బొమ్మల మీద క్లిక్ చేసి మీరే చదువుకొని ఆనందించండి. మన చందమామ శంకర్ గారి గురించీ సమాచారం వారి అభిమానుల ప్రయత్నం వల్ల ఎంతో కొంత లభ్యమౌతోంది. కానీ అమరచిత్ర కథలకు జీవం ఉట్టిపడేటట్లు ఎన్నో బొమ్మలు గీసిన ప్రదీప్ సాథే గారి ఫొటో దొరకడమే కష్టమైపొయింది. ఇంటర్నెట్ లో వెతగ్గా వెతగ్గా వారిఫొటో ఒక్కటి మాత్రం దొరికింది. టింకిల్ లో వస్తూండే కాళియా కాకి కథ, ఫలానా (జంతువు లేదా పక్షి) ని కలుసుకోండి, అంటూ వచ్చే చాలా శీర్షికలకు వీరి బొమ్మలు వేసారు. కానీ అమరచిత్ర కథ వారుకూడా వీరి వివరాలను వారి వెబ్ సైటులో ఉంచకపోవడం చాలా విచారకరం. ఏది ఏమైనా ఒకే కథకు ఇద్దరు చిత్రకారుల విభిన్నమైన చిత్రణ, రెండు రకాల ఆర్టిస్టిక్ ఎక్స్ ప్రెషన్ మీకూ నచ్చిందని తలుస్తాను.
నాకు మాత్రం మన శంకర్ గారు గీసిన 'శరభం'(మొదటిది) నచ్చింది.
శంకర్ గారి గురించిన మరింత సమాచారం "మన తెలుగు చందమామ బ్లాగ్ లో" చూడండి.
అలాగే ప్రదీప్ సాథే గారుకూడా అమరచిత్ర కథ, టింకిల్ లకు మాత్రమే కాకుండా ఇంకొన్ని సైన్సు ఫిక్షన్, డిటెక్టివ్ కామిక్స్ కూడా బొమ్మలు వేసారని తెలుస్తోంది. ఇంకేమైనా సమాచారం వుంటే మిత్రులెవరైనా పంచుకోగలరు.
Very good comparison. Hats off to your interest in collecting similar story from two different sources and posting an article.
ReplyDeleteGood work.
కనీసం ప్రదీప్ సాథే గారి ఫోటో అయినా సేకరించి భద్రపర్చారు. అలాగే తన గురించిన వివరాలు ఇంగ్లీషులో అయినా సరే ఉంటే మీరే సేకరించగలరు. చందమామకు శంకర్ గారి లాగా, అమర్ చిత్ర కథకు బొమ్మలద్దిన చిత్రకారుడి వివరాలు భద్రపర్చటం చాలా అవసరం. చూస్తుంటే చందమామకు లాగే అమర్ చిత్ర కథ కూడా తన సిబ్బందికి అజ్ఞాత జీవితాన్నే ప్రసాదించినట్లు కనపడుతోంది.
ReplyDeleteశంకర్ గారు ప్రదీప్ గారు ఒకే కథకు గీసిన బొమ్మలు అందులోనూ రెండు భిన్నకాలలో, రెండు భిన్న మాగజైనులకు.మీ సేకరణ చాలా బాగుంది. బొమ్మల విషయానికొస్తే నాకు చిత్రరీతులు తెలియవుకాని శంకర్ గారి దాంట్లో ముని, అలాగే అడవిలో సీను డెవలప్ మెంటు, జంతువుల తరుములాటలు మనస్సుకెక్కాయి.అంతమాత్రంచేత జీవం వుట్టిపడే విధంగా చిత్రించిన ప్రదీప్ గారిని తక్కువచేయడంకాదు..ఇద్దరు ఉద్ధండులైన చిత్రకారులనీవిధంగా గుర్తు చేసిన మీ కృషి అభినందనీయం..
ReplyDelete@ శివగారికి, ధన్యవాదాలు.
ReplyDelete@ నెలవంక రాజు గారూ, నా మీద పెద్ద బాధ్యతే పెట్టారు. ఈ పోస్టు వ్రాసి చాలా రోజులైంది. ఆ వివరాలకోసం ప్రయత్నించి దొరకక సర్లేమ్మని పబ్లిష్ చేసేశాను. ప్రదీప్ సాథే గారి వివరాలకోసం మళ్ళీ ప్రయత్నిస్తాను.
@హనుమంతరావు గారూ: ధన్యవాదాలు.
Sri Anwar, Famous Cartoonist and artist's comments by email as below:
ReplyDeleteశ్రీ శ్యాం గారికి, ప్రదీస్ గారి బొమ్మల కథలు నా చిన్నప్పుడు ఈనాడు మూడవ పేజీ చివర్లొ కుడి వైపు చూస్తూ చదువుతూ ఆనందిస్తూ పెరిగాం గాని ఆయన పేరు అప్పట్లొ తెలీదు, అప్పారావు గారి బ్లాగ్ లొ ఆయన బొమ్మలు చూసి పైదంతా గుర్తుకు వచ్చింది, ఆ సమయంలొనే ఆయన గురించి వెతికితే ఈ మాత్రం సమాచారం తప్ప మరేమీ నాకు దొరక లేదు. Kalia the Crow will always remain my favourite cartoon character.. May Mr. sathe's soul rest in peace... its so sad that in India just like the divide between the rich and the poor that keeps increasing all the while, there are only certain people in certain industries who lap up all the honoue and attention! Its only the film and cricket stars that get all the accolades.. achievements in every other field remains unnoticed!! Its so unfair!! ఇంతకుమించి ప్రస్తుతం నావద్ద సమాచరమేమి లేదు, క్షమించండి.
- Anwar
Thankyou Anwar ji.. - Radheshyam
శ్రీ అన్వర్ గారు మెయిల్ ద్వారా పంపిన కామెంట్:
ReplyDeleteశ్యాం గారు ధన్యవాదాలు.
మీ పొస్ట్ లొ కామెంట్ పెట్టిన హనుమంత రావు గారు తప్పుగా అనుకొక పొతే ఆయన కొసం ఇది, దాదాపుగా అందరికి తెలిసిన లేదా తెలియని విషయం ఇది, కథకు బొమ్మ, కార్టూన్, పొర్టైట్ , కామిక్ దేనికది వేరు వేరు ,కథల్లొ బొమ్మల్లొ కూడా , పిల్లల బొమ్మలు, పెద్దల బొమ్మలు కూడా వేరు , మహా చిత్రకారులు , గురువులు శంకర్ గారు చందమామలొ అంత అద్భుతం గా బొమ్మలు వేసినప్పట్టికీ, యువ లొ సాంఘీక కథలకు వేసిన బొమ్మలు చాలా పేలవంగా వుంటాయి ,అది ఆయన తప్పు కాదు కొన్ని సంవత్సరాలుగ ఒక రకమయిన బొమ్మలకు అలవాటు పడ్డంవల్ల కలిగే చిత్ర స్తిరత్వం, ఆట్లాగే వడాదిపాపయ్య గారు ( ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా నాకు అర్హత లేనప్పట్టికీ... ఆయన రంగుల్లొచూపించిన విన్యాసం రేఖ లొ కానరాకపొవడం సహజం.
తమాషా చూడండి కాన్వాస్ సైజ్ కూడా చిత్రకారునితొ ఎట్లా ఆడుకుంటుందొ! కార్టూనిస్ట్ శ్రీధర్ గారు, సుభాని గార్లు పాకెట్ కార్టూన్ల్ బొమ్మలొ చూపించిన కాంపొజిషన్ పెద్ద కార్టూన్ బొమాల్లొ ఎట్లా తేలిపొతుందొ,
మీరు పైన చూపించిన బొమ్మల కథల్లొ శంకర్ గారు మొదటిపేజీలొ విపరీతం గా వర్క్ చేసి వుంది. తరవాత్తర్వాతి బొమ్మల్లొ వర్క్ పలుచగా వుంది, కాంపొజిష్న్ లు కూడా ఫ్లాట్, పైగా ఆ బొమ్మల ఎక్స్ప్రెషన్లు కూడా సాదాగా వున్నాయి ,కారణం ఆయనవ్ స్కూల్ వేరు కామిక్ లక్షణం ఆయన బొమ్మలకు వుండకపొవడం,
ఆట్లాగే ప్రదీప్ గారి బొమ్మల్లొ చూడంది కామిక్ ఆర్టిస్ట్ కు కావాలసిన అన్ని లక్షణాలు పుష్కలం గా వున్నవాడు, కామిక్ అంటేనే పిల్లల కోసం ఆయన్ బొమ్మల్లొ పిల్లలకు కావాల్సిన ఫన్ నిండుగా వుంది , యాక్షన్ కూడా బ్రమ్హండం , అన్ని ఫ్రేం లు కూడా కామిక్ తరహాలొ బేలెన్స్డ్ గా కుదిరాయి.
-Anwar
Want to see Anwar's art work, please visit: http://www.flickr.com/photos/anwartheartist/ http://thisisanwar.blogspot.com/
రాధేశ్యాం గారూ! మీ ప్రయత్నం చాలా బాగుంది. అభినందనలు! ఒకే కథకు ఇద్దరు గొప్ప చిత్రకారులు ఎలా చిత్రకల్పన చేశారో పక్కపక్కనే చూడటం అద్భుతంగా అనిపిస్తోంది!
ReplyDeleteశంకర్ గారి సూక్ష్మాంశాల చిత్రీకరణ శైలి ఎంత బాగుందో, ప్రదీప్ గారి టిపికల్ కామిక్ స్టైల్ కూడా అంతే బాగుంది! ప్రదీప్ గారి బొమ్మల వ్యాఖ్యానాన్ని తెలుగులిపిలో రాసిన చిత్రకారుడి పేరేమిటో! ఆ అక్షరాల తీరు పరిచితంగా అనిపిస్తోంది!
nenu apudu naalugava tharugathi chaduvuthunnanu.... maa thaathayya naa chinnapudu ee sarabham katha gurinchi cheppinadu... kani daniki 8 kaallu untayani cheppe sariki ela vuntaaya ani anukune vaadini.. oka roju... maa class teacher ee katha bommalatho theesukochadu.. naaku sarabham ela vuntado theledu kadaa... anduke mundu gane katha cheppanu... ayanaki kopam vachi bayatiki pampincharu... nenu sarabham elavuntado chudataniki katha munde cheppina... adi bedisi kottindi... aaroju nenu chulleka poyina sarabham bommalu ... malli mee dwara thilakistunnanu.... chala kritagnathalu...
ReplyDelete