'భువన విజయం' అందరికీ తెలిసిన కార్యక్రమమే కదా..! రాయలవారు తమ ఆస్థానంలోని అష్ట దిగ్గజకవులతో కొలువుతీరి వారి కవితా మాధురీ మకరందాలను గ్రోలే సభాస్థలిని ఈ కాలం లో మన కళ్ళముందు ముందు నిలిపే సాంస్కృతిక కార్యక్రమమే 'భువనవిజయం'. పాత్రధారులు స్వయంగా కవిత్వంలో ప్రవేశాన్ని కలిగి ఉండి తాము ఎవరిపాత్రనైతే ధరించారో ఆ కవి వ్రాసిన కావ్యాలలో నుంచీ పద్యాలను మనకు వినిపిస్తారు.
అయితే ఈ కవితా గానం తో పాటు, హంపీ విజయనగర శిల్పకళా వైభవాన్ని కళ్ళకు కట్టే దృశ్య మాలికనూ, మరియు ఆ నాటి రాజకీయ సామాజిక స్థితిగతులను గురించి మహామంత్రి తిమ్మరుసు తో చేసిన ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని కలుపుకొని ఈ కార్యక్రమం 'త్రి' భువన విజయమై విశాఖ ప్రేక్షకులను మైమరపింప జేసింది..!! ఆద్యంతమూ కార్యక్రమాన్ని వీక్షించి విశాఖ వాసులు తమ రసజ్ఞతను మరొక్కసారి చూపించారు.

5
పై ఫోటోలు వరుసగా..
- ప్రేక్షకులు, ఆహ్వానితులమధ్యలో ప్రత్యేక అతిధి శ్రీకృష్ణ దేవరాయల వారసులలో పంతొమ్మిదవ తరానికి చెందిన రాజ వంశజుడు... వీరిపేరుకూడా కృష్ణ దేవరాయలే.ప్రస్తుతం బెంగళూరు లో వుంటున్నారు.
- కృష్ణ దేవరాయల పాత్రధారి మేకప్ తో మరియు మేకప్ లేకుండా..
- భువన విజయ సభాప్రాంగణం లో తమ అష్టదిగ్గజ కవులతో ఆసీనులవుతున్న శ్రీ కృష్ణ దేవరాయలు.
- పాత్రలూ .. పాత్ర దారులూ..!!
- శ్రీ కృష్ణ దేవరాయల వారితో నేను..
No comments:
Post a Comment
🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.