Eustace Fernandes |
మన దేశం లో వ్యాపార ప్రకటనలు చాలానే వచ్చినా అందరికీ సదా గుర్తుండే ప్రకటనలలో అముల్ డైరీ వారి 'అమూల్ పాపాయి' ప్రకటన తప్పకుండా వుంటుంది. దానికి వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. చక్రాల్లాంటి కళ్ళతో చుక్కల గౌను తో బొద్దుగా కనిపించే ఆ అల్లరిపిల్లకి ఇప్పటికి సుమారు నలభై అయిదు సంవత్సరాల వయసు. She is all set to enter the Guinness Book of World Records for being the longest running campaign in the world.
సమకాలీన సంగతులని, వార్తలనీ వ్యంగ్యంగా చూపిస్తూ అమూల్ వెన్నకి ప్రచారకర్తగా వున్నఆ చిట్టితల్లికి దేశమంతా అభిమానులున్నారనటంలో సందేహం లేదు. ముఖ్యనగారాల్లోని ప్రధాన కూడళ్ళలో పెద్దపెద్ద బిల్ బోర్డ్స్ ని ఆగి చూసి మరీ వెళ్తారు చాలా మంది.
అంత ప్రాచుర్యం పొందిన ఈ మస్కట్ రూపకర్త శ్రీ యూస్టేస్ ఫెర్నాండెజ్ 1966 లో రూపొందించారు. భారతదేశంలో క్షీరవిప్లవానికి మూల పురుషుడు, పాల సహకార ఉద్యమ నిర్మాత ఐన శ్రీ వర్ఘిస్ కురియన్ ఆధ్వర్యంలో చిన్నగా మొదలైన కైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం బాగా అభివృద్ధి చెందింది. ఇతర సంస్థల ఉదారమైన సాయం లేకుండా తమంత తాముగా భారతదేశంలో మొట్టమొదటి ఆధునిక పాల ఉత్పత్తుల కేంద్రం నెలకొల్పే స్థాయికి చేరింది. గుజరాత్ లోని ఆనంద్ అనే గ్రామంలో ' ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్'(దీని సంక్షిప్త నామమే 'అముల్') గా ఆవిర్భవించి జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించబడింది. అమూల్య అనే సంస్కృత పదానికి సమానార్ధం గా మరియు ఆనంద్ పాల ఫ్యాక్టరీ లో తయారయ్యే ఉత్పత్తుల నాణ్యత, స్వచ్ఛత లకు ప్రతిబింబంగా పెట్టిన 'అమూల్' బ్రాండ్ నేమ్ కి అంతే దీటుగా ఈ మస్కట్ కూడా రూపొంది అంతే పేరు తెచ్చుకుంది.

భారతదేశ అడ్వర్టైజింగ్ రంగానికి విశేషమైన సేవలందించి, లిమ్కా, LIC వంటి సంస్థలకి లోగోలూ, వ్యాపార ప్రకటనలూ రూపొందించిన శ్రీ ఫెర్నాండెజ్ గారు తన డెబ్భై అయిదవ ఏట కాన్సర్ తో పోరాడుతూ 2010మార్చి పదవతేదీ న మరణించారు. కింద వున్న వారి ఇంటర్వ్యూ లలో కొన్ని ఆసక్తి కరమైన అంశాలు వున్నాయి. క్లిక్ చేసి బొమ్మ పెద్దది చేసి చదవవచ్చు.
వారి ఫేస్ బుక్ ఎకౌంటు కి లింక్:
Eustace-eusfull-Fernandes
Amul girl ads on Face book link 1
Amul girl ads on Face book link 2
Advertising Ka Kamaal...(Amul ads)
పై లింక్ మీద నొక్కి మరిన్ని ads చూడండి.
అయ్యా.. పైకి చిన్నపిల్లలా కనిపిస్తున్నా ఈవిడకి నలభై అయిదేళ్ళు. వారానికి ఒక కార్టూన్ ad అనుకుంటే 2300 పైన బొమ్మలుంటాయి. కనీసం పదిరోజుల కొకటను కున్నా సుమారు 1650. అంచేత ఇంకా ఓపిక వుంటే ఇదికూడా చూడండి:
నేను సేకరించిన సుమారు ఒక అరవై అడ్వర్టైజ్మెంట్ లు (లింక్ నొక్కండి)
పైన ఇచ్చిన లింకులన్నిటి సొంతదారులకీ మనఃపూర్వక ధన్యవాదాలు.
No comments:
Post a Comment
🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.