Sunday, October 13, 2013

వడ్డాది పాపయ్య గారి తొమ్మిది దుర్గలు

బ్లాగు మిత్రులందరికీ విజయ దశమి శుభాకాంక్షలు!!
 శ్రీ వడ్డాది పాపయ్య గారు వివిధ పత్రికలకు (చందమామ, స్వాతి, వేదాంత భేరి ఇత్యాది..) గీసిన దుర్గా దేవి చిత్రాలు దసరా సందర్భంగా:








సరస్వతి దేవి:
 

ఈ నవరాత్రులలో తొమ్మిది రూపాలలో కొలువుతీరే దుర్గా మాత అవతారాలను వర్ణిస్తూ మార్కండేయ విరచిత దేవీకవచమ్ లో ఈ శ్లోకంలో చెప్పబడింది:

ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||
నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||

 ౧.  శైలపుత్రి

౨. బ్రహ్మచారిణి
౩. చంద్ర ఘంట

౪. కూష్మాండ

౫. స్కంద మాత

౬. కాత్యాయని

౭. కాళరాత్రి

౮. మహా గౌరి

౯. సిధ్ధి ధాత్రి

శ్రీ దేవరకొండ సుబ్రహ్మణ్యం గారు వారి బ్లాగులో ఈ నవ విధ దుర్గల ప్రాశస్త్యాన్ని వివరించారు. ఆసక్తి గలవారు ఈ లింకులో చూడవచ్చు  

నవ దుర్గలు

జయ జయ వైష్ణవి దుర్గే అంబ జయ జయ కల్పిత సర్గే
జయ జయ తోషిత భర్గే
అంబ జయజయ కుచ జిత దుర్గే ||
 

శ్రికర సద్గుణ జాలే అంబ సింధూర రంజిత ఫాలే
పాకశాసన మణినీలే
అంబ ప్రాలేయ భూధర బాలే
 

పాలిత కిసలయ చాపే అంబ పార్వతి లోకైకదీపే
కాళిక కోమల రుపే
అంబ ఖండిత త్రిభువన తాపే ||

శంకరి సత్క్రుపాపూరే
అంబ సంభ్రుత సన్మణిహారే
సాంకవలిప్త శరిరే
అంబ సంగతాంగ కేయూరే ||

వీణా వినోదిని గిరిజే
అంబ విద్రుమ మణి సన్నిభ గిరిజే
మానిత లోక సమాజే
అంబ మదన గోపాలక సహజే ||




పూర్తిగా చదవండి...

Saturday, September 14, 2013

తలపాగాలు..!


ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలోనూ, ప్రతి సంస్కృతిలోనూ "తలపాగా" లను  ఏదో ఒక రూపంలో చూస్తాం. ప్రతికూల వాతావరణాల నుంచీ తమను తాము కాపాడుకోవడానికి తలపాగాలను మానవుడు రాను రాను తన జీవన విధానానికి, హోదాకి చిహ్నంగా రూపొందించుకొన్నాడు. పూర్వం మహారాజులు మణుగుల కొద్దీ బరువైన రత్నఖచిత కిరీటాలను పట్టాభిషేక మహోత్సవాల లాంటి ప్రత్యేకమైన సందర్భాలకి పరిమితం చేసి సాధారణ సందర్భాలలో వారి దర్పాన్ని ఇనుమడింపజేసే నగిషీలతో తక్కువ బరువు కలిగిన వివిధ రకాల తలపాగాలనే ఉపయోగించేవారు. ఇప్పుడు వాటికి మరిన్ని వన్నె చిన్నెలు కలిసి అందానికి, హుందాతనానికి ప్రతీకలుగా ఫ్యాషన్ ప్రపంచంలోకి కూడా వచ్చి చేరాయి.
తెలుగు భాషకు తలకట్టు ఎంత  ముఖ్యమో తెలుగువాడి తలకు తలపాగా కూడా అంతే అన్నంతగా మన తెలుగు సంస్కృతిలో తలపాగకు ప్రత్యేకమైన స్థానం ఉండేది. మన పంచకట్టు ఎంతకష్టమో తలపాగా చుట్టడం  కూడా అంతే కష్టం. తలపాగా చుట్టడం ఒక కళ. అది 'టోపీ' పెట్టేసినంత సులువు కాదు. దానిననుసరించే సామెతలు కూడా పుట్టుకొచ్చాయి. తలపాగా చుట్టలేక బుర్ర వంకర అన్నాట్ట వెనకటికి ఎవడో. అలాగే కోటలో (తల)పాగా వేశాడు అంటే  దివాణం లో పనిలో కుదిరాడు అని అర్థం. అంటే కొలువులో చేరగానే అతని హోదాకి తగ్గ తలపాగా ఇచ్చి గౌరవించేవారేమో!! ఇప్పుడు ఆ సంప్రదాయం లేదు కానీ ఈ మధ్య మన రాజకీయ నేతలు మాత్రం పార్టీ మారగానే కొత్త పార్టీ కండువాలు కప్పించుకొని వాళ్ళ పాత రంగులు మారుస్తున్నారు. 
 
మన దేశం లో చూస్తే కొన్నిసంప్రదాయాల కుటుంబాలకు కొన్ని ప్రత్యేకమైన తలపాగా ఉంటుంది. రాజస్థానీలకు, పంజాబీలకు, మరాఠీ లకూ, కన్నడిగులకూ ప్రత్యేకమైన తలపాగాలు ఉన్నాయి. అయితే బాలగంగాధర తిలక్ ధరించిన ఈ తలపాగా కి "పూనే రి పగిడీ" అని పేరు. దీనికి సుమారు రెండు వందల ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ పగిడీ ని 19 వ శతాబ్దం లో మొదట ప్రాచుర్యం లోకి తెచ్చింది ప్రముఖ సంఘ సంస్కర్త, శ్రీ మహదేవ్  గోవింద రెనేడే. శ్రీ పూనే రి పగిడీ సంఘ్ అనే సంస్థ చేసిన కృషి వల్ల 4 September 2009 Geographical Indication Registry వారి ద్వారా దీనికి  Geographical Indication ట్యాగ్ కూడా లభించింది. [The pagadi got the Intellectual Property Right (IPR) and selling of any turban made outside Pune, under the name of Puneri pagadi became illegal. Along with the Puneri pagadi, IPR has been previously issued to Indian products like Darjeeling tea, Banarasi saris, Tirupati ladoos, among others. సోర్స్: వికి పిడియా]

కొందరు ప్రముఖుల్ని తలపాగా లేకుండా ఊహించడం కష్టం. అలాంటి వారిలో కొందరు :
బాల గంగాధర తిలక్
సంఘ సంస్కర్త రాజా రామ్ మోహన్ రాయ్



స్వామీ వివేకానంద





అలాగే మనరాష్ట్రం లోని కొందరు ప్రముఖులు:
చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు
శ్రీ కందుకూరి వీరేశలింగం
వ్యవహారిక భాషా పితామహుడు శ్రీ గిడుగు రామ్మోర్తి గారు 
శ్రీ గురజాడ అప్పారావు గారు

దివంగత రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ 
కన్నడ తలపాగా లో శ్రీ పీ బీ శ్రీనివాస్ 
 అరుదుగా తలపాగా కట్టినా చూడచక్కని వాళ్ళు కొందరు .. 

ఆంధ్రుల అభిమాన నటుడు, నాయకుడు  NT రామారావు 





 అలాగే ప్రముఖులు కాని మరికొందరు:
***
*** 




***
***
(*** గుర్తు ఉన్న ఫోటోల  సౌజన్యం: turban tying expert శ్రీ మహేంద్ర సింగ్ పరిహార్ 
 http://rajwadisafa.blogspot.in/)
పూర్తిగా చదవండి...

Monday, September 9, 2013

పరబ్రహ్మరూపం గణేశం భజేమ..!

శ్రీ గణపతి స్తవః  :
ఋషిరువాచ :-
అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందమద్వైతపూర్ణమ్ |
పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మరూపం గణేశం భజేమ ||1 ||


గుణాతీతమానం చిదానందరూపం చిదాభాసకం సర్వగం జ్ఞానగమ్యమ్ |
మునిధ్యేయమాకాశరూపం పరేశం పరబ్రహ్మరూపం గణేశం భజేమ || 2 ||


జగత్కారణం కారణజ్ఞానరూపం సురాదిం సుఖాదిం గుణేశం గణేశమ్ |
జగద్వయాపినం విశ్వవంద్యం సురేశం పరబ్రహ్మరూపం గణేశం భజేమ || 3 ||


రజోయోగతో బ్రహ్మరూపం శ్రుతిజ్ఞం సదా కార్యసక్తం హృదాచిన్త్యరూపమ్ |
జగత్కారణం సర్వవిద్యానిదానం పరబ్రహ్మరూపం గణేశం భజేమ  || 4 ||


సదా సత్యయోగ్యం ముదా క్రీడమానం సురారీన్హరంతం జగత్పాలయంతమ్ |
అనేకావతారం నిజజ్ఞానహారం సదా విశ్వరూపం గణేశం నమామః || 5 ||


తమోయోగినం రుద్రరూపం త్రినేత్రం జగద్ధారకం తారకం జ్ఞానహేతుమ్ |
అనేకాగమైః స్వం జనం బోధయంతం సదా సర్వరూపం గణేశం నమామః || 6 ||


తమస్స్తోమహారం జనాజ్ఞానహారం త్రయీవేదసారం పరబ్రహ్మసారమ్ |
మునిజ్ఞానకారం విదూరే వికారం సదా బ్రహ్మరూపం గణేశం నమామః || 7 ||


నిజైరోషధీస్తర్పయంతం కరాద్యైః సురౌఘాంకలాభిః సుధాస్రావిణీభిః |
దినేశాంశుసంతాపహారం ద్విజేశం శశాంకస్వరూపం గణేశం నమామః || 8 ||


ప్రకాశస్వరూపం నభో వాయురూపం వికారాదిహేతుం కలాధారరూపమ్ |
అనేకక్రియానేకశక్తిస్వరూపం సదా శక్తిరూపం గణేశం నమామః || 9 ||


ప్రధానస్వరూపం మహత్తత్వరూపం ధరాచారిరూపం దిగీశాదిరూపమ్ |
అసత్సత్స్వరూపం జగద్ధేతురూపం సదా విశ్వరూపం గణేశం నతాః స్మః || 10 ||


త్వదీయే మనః స్థాపయేదంఘ్రియుగ్మే జనో విఘ్నసంఘాతపీడాం లభేత |
లసత్సూర్యబింబే విశాలే స్థితోయం జనో ధ్వాంతపీడాం కథం వా లభేత || 11 ||


వయం భ్రామితాః సర్వథాజ్ఞానయోగాదలబ్ధాస్తవాంఘ్రిం బహూన్వర్షపూగాన్ |
ఇదానీమవాప్తాస్తవైవ ప్రసాదాత్ప్రపన్నాన్సదా పాహి విశ్వంభరాద్య || 12 ||


ఏవం స్తుతో గణేశస్తు సంతుష్టో భూన్మహామునే |
కృపయా పరయోపేతోభిధాతు ముపచక్రమే || 13 ||

 స్వస్తి శ్రీ ఋషి కృతో గణపతి స్తవ స్సంపూర్ణమ్ ॥
***********************************************





పై ప్లేయర్ లో వినబడక పొతే దాని క్రింద ఇచ్చిన "స్కై డ్రైవ్" లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు .
చిత్రకారుడు : శ్రీ కూచి సాయి శంకర్
పూర్తిగా చదవండి...

మట్టి వినాయక ప్రతిమ

బ్లాగు మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 

పోయిన ఆదివారం మా ఇంట్లో నేను, మా పిల్లలూ, వాళ్ళ ఫ్రెండ్స్ కలసి మట్టి వినాయకుడిని చెయ్యడం కోసం ఇలా ఒక వర్క్ షాప్ ని విజయవంతంగా నిర్వహించుకున్నాం. మా పిల్లలు కృష్ణప్రియ, కృష్ణ ప్రీతమ్ వాళ్ళ స్నేహితులు భవ్య, భార్గవ్ లతో కలసి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. (భవ్య వాళ్ళ అమ్మ శ్రీమతి ఇందిర గారు నాకు కాలేజీ లో క్లాస్మేట్) వీళ్ళంతా మా శ్రీమతి వద్ద సంగీతం నేర్చుకుంటున్నారు. భవ్య, కృష్ణప్రియ తమ సహాధ్యాయులతో కలసి చిన్న చిన్న ప్రోగ్రాములలో కూడా పాడారు.
 మట్టి గణపతిని తయారు చెయ్యడానికి సూచనలిస్తూ  నేనే..!!
నేను, నా శిష్య బృందం.. మట్టి వినాయకుడి రూపకల్పనలో..!





మా అమ్మాయి కృష్ణప్రియ
మా అబ్బాయి కృష్ణ ప్రీతమ్ , వెనుక ఉన్నది వాడి ఫ్రెండ్ భార్గవ్ 







విఘ్నేశ్వరుడి తయారీలో మొదటి అంకం
భార్గవ్ వాళ్ళ అక్క..! పేరు భవ్య..
















ప్రతి ఫోటో క్రింద ఆ బొమ్మ తయారు చేసిన వారి పేరు చూడండి.
కృష్ణప్రియ
 కృష్ణ ప్రీతమ్ ( దీనికి రంగులేసింది నేను..!)

ప్రీతమ్ , భార్గవ్, భవ్య
తయారు చేసినది భార్గవ్, కుంచె తో రంగులద్దింది  వాళ్ళ అమ్మ శ్రీమతి ఇందిర గారు
భవ్య

ఇది నేను గీసినదే..! బ్లాక్ బోర్డ్ పైన సుద్దముక్కతో ..!!
  

ఇదివరకు వినాయకచవితి సందర్భంగా వ్రాసినవి :

యువ లో అచ్చయిన వపా గారి వినాయకుడి బొమ్మలు మరికొన్ని...!!

కాలుష్య కారక గణపతి ఉత్సవ మండళ్ళు..!!

మంటపాలలో కొలువుతీరడానికి సిద్ధంగా ఉన్నగణపతులు..!!

మేము చేసిన మట్టి వినాయక ప్రతిమ..!!

వడ్డాది పాపయ్య గారి వినాయకుడు...

 

 

పూర్తిగా చదవండి...

Saturday, July 20, 2013

ఆండ్రాయిడ్ ఫోన్ లో తెలుగు యూనికోడ్ ఫాంట్ ని జోడించడం ఎలా??


ఆండ్రాయిడ్ ఫోన్ లో తెలుగు యూనికోడ్ ఫాంట్ ని జోడించడం ఎలా??
నేను వాడుతున్న Xperia x10i (Sony Ericsson)

MultiLing Keyboard
Multiling Keyboard
Telugu Pride Telugu Editor
Telugu Pride Editor



నా ఫోన్ సోనీ ఎరిక్సన్ XPERIA X10i లో తెలుగు ఫాంట్ install  చెయ్యడానికి శతవిధాల ప్రయత్నించి, కుదరక ఆఖరికి 'ఓపెరా మిని' తో పని కానిచ్చేస్తూ ఉండేవాడిని. ఈ పధ్ధతిలో తెలుగు లిపి బ్రౌజర్లో చూడడం వరకు పర్వాలేదు. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లతో డిఫాల్ట్ గా వచ్చే అప్లికేషన్స్ (ఉదా. జి-మెయిల్, యాహూ మెయిల్ లాంటివి, తెలుగులో ఉన్న వర్డ్ డాక్యుమెంట్ ఫైల్స్) లో మాత్రం డబ్బాలే కనిపించేవి. మన బ్లాగు ఫోన్ లో ఓపెరా మినీ ద్వారా చూసినా కామెంట్ మనం మళ్ళీ తెలుగులో టైపు చెయ్యాలంటే అస్సలు కుదరదు. తెలుగులో టైపు చెయ్యడానికి ఆండ్రాయిడ్ మార్కెట్ లో కొన్ని తెలుగు టైపింగ్ అప్లికేషన్స్ (MultiLing Keyboard app , My Alpha app , Telugu Pride Editor లాంటివి  ) ఉన్నాయి కానీ, అన్నీ ఆవు కాంపోజిషన్ లో లాగ "ఇన్-బిల్ట్ తెలుగు ఫాంట్ - డబ్బాలు" దగ్గరకే వచ్చి ఆగేవి. ఆ టైపు రైటర్ తో టైపు చేసిన అక్షరాల రెండరింగ్ సరిగ్గా కనిపించేది కాదు. అంటే తెలుగు లిపి ఇలా కనిపించేది: (ఎంత చిరాగ్గా ఉంటుందో చూడండి)
   


ఇన్ బిల్ట్ ఫాంట్ ఉంటే ఈ సమస్యలన్నీ పోతాయి. Telugu Pride Editor,  ఐఫోన్ లో చాలా బాగా కనిపిస్తోంది. Samsung S III లాంటి కొన్ని మోడల్స్ తెలుగు ఫాంట్ సపోర్ట్ చేస్తున్నాయి. ఆండ్రాయిడ్ లో మాత్రమే ఆ సదుపాయం లేదు.
                వెతగ్గా వెతగ్గా అర్థమైన సంగతేమిటంటే ఫోన్ లో మనకి కావలసిన ఫాంట్లు డౌన్లోడ్ చెయ్యాలంటే మన ఫోన్ ని 'ROOT' చేసుకోవాలట. అయితే రిస్క్ ఏమిటంటే ROOT చెయ్యబడిన తరువాత / లేదా చేస్తూ ఉండగా మొదటికే మోసం వచ్చి ఫోన్ పేపర్ వెయిట్ గా తప్ప మరి దేనికీ పనికిరాకుండా పోవచ్చుట. పర్ఫెక్ట్ గా పనిచేసినా చెయ్యవచ్చుట. సాహసం శాయరా డింభకా ..! అనుకోని మొత్తానికి నా ఫోన్  ROOT చేసేసాను. పర్ఫెక్ట్ అవునో కాదో తెలీదు కానీ చిక్కులేమీ ఎదురుకాలేదు. వెంటనే యూనికోడ్ ఫాంట్ 'లోహిత్ - తెలుగు' install  చేసి చూశాను. కానీ పని చెయ్యలేదు. అసలు Install అవలేదు. సరేలే! ఫోను పాడవ్వలేదు అనుకోని  ఊరుకున్నాను.
                   ఈలోగా ఒక తమాషా అయిన పద్దతి లో గుజరాతి ఫాంట్ ని ఆండ్రాయిడ్ ఫోన్ లో install చేసిన వ్యక్తి వ్రాసిన పోస్టు కనిపించింది. దీనికి కూడా మన ఫోన్ తప్పనిసరిగా ROOT చెయ్యబడి ఉండాలి. కాన్సెప్ట్ ఏమిటంటే మనదగ్గర ఉన్న యూనికోడ్ ఫాంట్ ని, ఫోన్ లోని system ఫాంట్ (ఇన్-బిల్ట్ ఫాంట్) పేరుతో rename చేసి ఈ rename చెయ్యబడిన మన ఫాంట్ ని ఫొన్ లోని సిస్టం ఫాంట్ మీద Overwrite చేసెయ్యాలి. 

పైన పేర్కొన్న పోస్టు లో చెప్పిన స్టెప్స్ నేను ఈ క్రింది విధంగా అమలు చేసాను. 
  1. కంప్యూటర్ లో "C:\Windows\Fonts" ఫోల్డర్ లో ఉన్న యూనికోడ్ ఫాంట్ (ఉదా. గౌతమి) ని తీసుకొని  ఫోన్ యొక్క SD కార్డు లోకి copy చేశాను.  
  2. SD కార్డు లోకి copy చేసిన ఫాంట్ ని "DroidSansThai.ttf" గా rename  చేశాను. (ఈ ఫాంట్ పేరుతో మన ఫోన్ లో 'థాయ్' లిపి install చేసి ఉంటుంది. మనకి థాయ్ లిపి అక్కర్లేదు కాబట్టీ దీన్ని ఉపయోగించుకుంటున్నాం.  
  3. ఫోన్ లోకి 'ES File Explorer'  అనే app ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేశాను
  4. ES File Explorer -  settings లో Root Explorer ని enable చేస్తే, వచ్చిన బాక్స్ లో Mount  R / W, అన్న దానిపై క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ కనిపించింది. RO (Read - Only ) లో ఉన్న సెలక్షన్ ని RW (Read & Write) కి మార్చాను. 
  5. ఇప్పుడు ES File Explorer ద్వారా స్టెప్ 2లోని ఫైల్ ని (originally "gautami.ttf" but  renamed as "DroidSansThai.ttf") తీసుకుపోయి ఆండ్రాయిడ్ ఫోన్ Root Directory లోని " /system/fonts " directory లోకి Cut - Paste పద్దతి లో Move చేసాను. ఆ ఫాంట్ పేరుతో ముందే ఇంకో ఫైల్ ఉంటుంది కాబట్టీ Overwrite  చేసాను. (Systam Files ని ఈ ప్రకారంగా మార్చడానికే  కావలసిన అనుమతులు (permissions) మన ఫోన్ ని ROOT చెయ్యడం ద్వారా సమకూరుతాయి. తద్వారా మన ఫోన్ లోకి SUPER User అనే app install  అవుతుంది. ఈ అనుమతులన్నీ ఈ Super User App అన్నదే ప్రాసెస్ చేస్తుంది.)
  6. ఇప్పుడు ఫోన్ ని restart చేశాను.

గౌతమి ఫాంట్ లో తెలుగు లిపిని స్పష్టంగా చూడచక్కగా దర్శనమిచ్చింది. 
నా ఫోన్ లో (android 2.3.3 version) ఈ పధ్ధతి పర్ఫెక్ట్ గా పని చేస్తోంది. 
(strictly THOSE who have already rooted their android phones only)

special thanks to Sri C K Patel, who worked out this wonderful Idea.
పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)