Saturday, March 24, 2012

వడ్డాది పాపయ్యగారి 'నక్షత్ర బాల' లు..! (నక్షత్రాలకు స్త్రీ రూపాలు)


క్రితం పోస్ట్ (వడ్డాది పాపయ్య గారి రాగ కన్యకలు..! రాగాలకు వపా గారు చిత్రించిన స్త్రీ మూర్తులు..!!) లో  వడ్డాది పాపయ్య (వపా) గారు రూపమిచ్చిన రాగ కన్యకల గురించి ముచ్చటించుకొన్నాం. ఇప్పుడు వారు గీసిన 'నక్షత్ర బాల' లను చూడండి. ఇవి కూడా యువ మాస పత్రికలలో వచ్చినవే..!

నాగ కన్యలు అని మన వాళ్ళు సినిమాలలో చూపించేటప్పుడు ఆహార్యం నాగ ముద్రలతో ఉన్నట్లు, వపా గారి ఈ 'నక్షత్ర బాల' ల ఆహార్యం లో పంచ శీర్షాలతో కూడిన తెల్లటి నక్షత్రాలు కనిపిస్తాయి. జాగ్రత్త గా చూస్తే ఆ నక్షత్ర సంబంధమైన లక్షణాలను ఆ యువతి లో గమనిస్తాం. పాపయ్య గారు ఆ నక్షత్రాల రాశులనో లేక పేరులోని అర్థాన్నో సింబాలిక్ గా ఉండేటట్టు ఊహించి ఈ చిత్రాలను గీశారనుకుంటాను.

[మన  ప్రాచీన  సంప్రదాయాల ప్రకారం (వాటిని జ్యోతిశ్శాస్త్రం అనాలో లేక ఖగోళ శాస్త్రం అనాలో తెలియలేదు..! బహుశ పంచాంగం అనాలేమో..!!) నక్షత్రాలు 27 .. అశ్విని, భరణి, కృత్తిక, మొదలైనవి. ప్రతీ నక్షత్రానికీ నాలుగేసి  పాదాలు. అలాగే రాశులు మేషం, వృషభం మొదలుగా గలవి..12. నాలుగు పాదాలతో కూడిన ఇరవై ఏడు నక్షత్రాలని( 27  x  4 = 108 ) పన్నెండు రాసులలోకి విభజిస్తే ఈ క్రింది విధంగా భాగించ బడతాయి.

అశ్వని భరణి కృత్తికా పాదో - మేషం 
కృత్తికాత్త్రయం రోహిణి మృగశిరార్థం - వృషభం 
మృగశిరార్థం ఆర్ద్రా పునర్వసుస్త్రయో - మిధునం
పునర్వసు పాదం పుష్యమి ఆశ్రేషాన్తం - కర్కాటకం 
మఖ పుబ్భా ఉత్తరాపాదం - సింహం 
ఉత్తరస్త్రయో హస్త చిత్రార్థం - కన్య 
చిత్రార్థం స్వాతి విశాఖత్త్రయో - తుల 
విశాఖపాదో అనూరాధా జ్యేష్టాంతం - వృశ్చికం 
మూల పూర్వాషాడ ఉత్తరాషాడ పాదో - ధనుః 
ఉత్తరాషాడత్త్రయో శ్రవణం ధానిష్ఠార్థం - మకరం 
ధనిష్ఠార్థం శతభిషం పూర్వాభాద్రత్త్రయో - కుంభం 
పూర్వాభాద్రపాదో ఉత్తరాభాద్ర రేవత్యాంతం - మీనం ]


పై శ్లోకం, దాని అర్థం http://jyotishavidyarthi.blogspot.in/2011/12/blog-post.html నుండి తీసుకొన్నాను. వారికి నా ధన్యవాదాలు.





రోహిణి 
'రోహిణి' వృషభ రాశికి చెందిన నక్షత్రం. వృషభానికి మల్లె  పొడుగాటి చెవులూ-కొమ్ములను తలపించే కేశాలంకరణ, మామూలుగా కన్నా కొంచం పొడవైన మెడ గమనించండి.
ఆశ్లేష 












 'ఆశ్లేష' కర్కాటక రాశికి చెందినది. ఈ నక్షత్ర సుందరి నడుము మీద   కర్కాటకం (పీత) గమనించండి.



మఖ 

మఖ నక్షత్రం సింహరాశిలోకి వస్తుంది. ఈ అమ్మాయి నిలబడిన తీరు, ముఖం చుట్టూ పరుచుకున్నజుట్టు సింహాన్ని తలపించటంలేదూ..!!
హస్త 











 
అలాగే హస్త నక్షత్రం..!! 'హస్త' అంటే చెయ్యి తో పాటూ ఏనుగు కూడా కదా.. అందుకే ఏనుగు ముఖం కూడా కనబడేటట్టు వేసారు




చిత్ర 
'చిత్ర' నక్షత్ర బాలను (వ్యావహారికం లో 'చిత్త') చిత్రకారిణి లాగా  గీశారు
స్వాతి 






   
 స్వాతి చినుకులు 
ముత్యపు చిప్పలలో పడి 
ముత్యాలుగా మారతాయంటాం కదా..!! అందుకేనేమో..చిత్రంలో ముత్యపు చిప్ప, దానిలో ముత్యాలూ, మధ్యలో 'స్వాతి'





విశాఖ
ఇక 'విశాఖ' సుందరి విషయానికొస్తే..రెండు చేతులలో బరువులుంచుకొని బేరీజు వేస్తున్నట్టు ( త్రాసులో తూకం వేస్తున్నట్టు) వేశారు. ఈ నక్షత్రం లో మొదటి మూడు పాదాలు తుల రాశి , ఒక పాదం వృశ్చికం..
(సుందరి కొప్పులో ఏముందో చూడండి)

శ్రవణం 




 .

   
 





శ్రవణం అందరికీ తెలిసినదే... విష్ణువు నక్షత్రం. రాశి మకరం. అందుకేనేమో ఈ యువతి రూప కల్పనలో విష్ణువాంశ చూపారు. కుడి చేతిలో చక్రం ధరించి ఎడమ చేతితో క్రిందనున్న మకరాన్ని (మొసలి) చూపుతోంది.


 

పూర్వాభాద్ర
ధనిష్ఠ 
శతభిషం 
ఇక పొతే 'ధనిష్ఠ', 'శతభిషం'  కుంభరాశికి చెందిన నక్షత్రాలు.. 'పూర్వాభాద్ర' యొక్క రాశి మీనం.
ఈ అమ్మాయికి కుడి వైపు చేపను చిత్రించారు.

వడ్డాది పాపయ్యగారి ఈ నక్షత్ర చిత్రాల్నీనక్షత్రాలూ - రాశులకు సంబంధించిన పైన చెప్పిన వివరాలనూ పోల్చితే నాకు కనిపించిన, అనిపించిన విషయాలను వ్రాశాను. అవి ఎంతవరకూ సహేతుకమో, ఈ విషయాల పైన పట్టున్న విజ్ఞులెవరైనా చెప్పాల్సిందిగా మనవి.

9 comments:

  1. వావ్! చాలా బాగున్నాయి! ఇవి కూడా సేవ్ చేసుకోవచ్చా? మిగతా నక్షత్రాలకి కూడా ఉన్నాయా లేక వీటికి మాత్రమే ఉన్నాయా? మిగతావి కూడా ఉంటే పెట్టరూ!

    ReplyDelete
    Replies
    1. @రసజ్ఞ: నా దగ్గర ఈ నక్షత్రాలవి మాత్రమే బొమ్మలు వున్నాయి. మిగిలినవి ఇంకేమైనా వేశారేమో తెలీదు. ఇక్కడ పెట్టిన బొమ్మలు అన్నీ అడక్కుండానే సేవ్ చేసుకోవచ్చు. అడుగుతున్నందుకు ధన్యవాదాలు.

      Delete
  2. ఆశ్లేష కటక రాసిలోనిది,చిహ్నం తేలు కాదు వ.పా గారు అక్కడ వేసింది ఎండ్రకాయ[క్రాబ్]..శ్రవణం శ్రీహరి ది శ్రిరామునిది కాదు.

    ReplyDelete
  3. పూర్వ అంటే పార్శ్వ భాగం కనుక పూర్వాభాద్రను సైడ్ ఆంగిల్ లో చూపారు.అశ్లేష సర్ప నక్షత్రం కనుక అక్కడ క్రాబ్ కి బదులుగా సర్పాన్ని చూపాలి.అదే విధంగా విశాఖ లో సర్పాన్ని చూపరాదు కాని అందులో సర్పాన్ని వేసారు

    ReplyDelete
    Replies
    1. ///అశ్లేష సర్ప నక్షత్రం కనుక అక్కడ క్రాబ్ కి బదులుగా సర్పాన్ని చూపాలి.///

      వపా గారి ఉద్దేశం ఏమిటో మరి..!!

      Delete
  4. శత్బిషం వంద తారలతో కూడిన వో పెద్ద తార కనుక అక్కడ పలు తారలను చూపారు.

    ReplyDelete
  5. @ఆస్ట్రో జోయ్డ్: మీ స్పందనకు ధన్యవాదాలు. మీరు ఎత్తి చూపిన తప్పులు సవరించాను.
    పూర్వాభాద్ర, శతభిషం నక్షత్రాలకి మీ వివరణ కూడా బాగుంది...!
    <>
    వపా గారి ఉద్దేశం ఏమిటో మరి..!!
    కానీ 'విశాఖ నక్షత్రం బొమ్మలో మీరు చెప్పినదాకా నాకు సర్పం కనబడలేదు. ఆ అమ్మాయి కొప్పులో 'వృశ్చికం' మాత్రమే కనిపించింది నాకు.

    ReplyDelete
  6. astrojoydMar 23, 2012 10:23 PM
    విష్ణువుకు, శివునకు జన్మనే లేదని విన్నాను, మరి ఈ జన్మ నక్షత్రం?

    ReplyDelete

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)