ఈఫిల్ టవర్ డ్రాయింగ్ లు,నిర్మాణం లో ఉన్నప్పుడు తీసిన ఫోటోలూ, విశేషాలు..!
ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటిగా ప్రసిద్దికెక్కిన ఈఫిల్ టవర్ దాని నిర్మాణ సమయం లోనూ తరువాతా కూడా ఎన్నో విశేషాలను మూట గట్టుకొంది.
ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటిగా ప్రసిద్దికెక్కిన ఈఫిల్ టవర్ దాని నిర్మాణ సమయం లోనూ తరువాతా కూడా ఎన్నో విశేషాలను మూట గట్టుకొంది.
పారిస్
నగరం లో 1889 లో జరిగిన ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎగ్జిబిషన్ కి గుర్తుగా
నిలచేటట్టు ఒక కట్టడాన్ని నిర్మించాలని తలపోశారు. పైగా ఫ్రెంచ్ విప్లవం
శతాబ్ది ఉత్సవం కూడా తోడయ్యింది. అందువల్ల కట్టబోయే నిర్మాణం చాలా
ప్రతిష్టాత్మకంగా మారింది. పారిశ్రామిక రంగంలో ఫ్రెంచ్ వారి ప్రగతిని
ప్రతిబింబించేలా ఉండాలనుకొన్నారు. చాలా డిజైన్లు పరిగణనలోకి వచ్చినా చివరకు
ఇప్పటి ఈఫిల్ టవర్ కు ఆమోదం లభించింది. అప్పటికే ఉక్కు నిర్మాణాలను కట్టడం
లో పేరుకెక్కిన Gustave Eiffel పారిస్ కు మాత్రమే కాక ఫ్రాన్స్ యావత్తూ
తలమానికంగా భావించబోయే ఈ టవర్ నిర్మాణాన్ని చేపట్టాడు. ఈ కట్టడం వల్ల
రాబోయే లాభ నష్టాలన్నిటికీ బాధ్యత వహించి మరీ రంగం లోకి దిగాడు. ప్రభుత్వం
వారు అతనికి ఇవ్వబోయేది కేవలం కావలసిన భూమి, మరియు మొత్తం ఖర్చులో పదోవంతూ
మాత్రమే. ప్రతిఫలంగా 20 ఏళ్ళ పాటూ ఆ కట్టడం మీద వచ్చే ఆదాయాన్ని, Eiffel
అనుభవించవచ్చు. 20 ఏళ్ళ తరువాత మాత్రం ఈ కట్టడాన్ని కూల్చేసి భూమిని
ప్రభుత్వపరం చేసెయ్యాలి. ఒప్పందం ఇంత కఠినంగా ఉన్నా తన డిజైను మీద నమ్మకంతో
ముందుకే వెళ్ళాడు Eiffel. మొత్తం నిర్మాణాన్ని రెండేళ్ళ పైన రెండు నెలలలో
పూర్తి చేసాడు.
టవర్ కి సంబంధించిన డిజైన్లు 1884 లోనే పూర్తిపోయినా
అది అందరి ఆమోదం పొందడానికి గానూ Eiffel ఎంతగానో కష్టపడవలసి వచ్చింది. 324
మీటర్ల ఎత్తైన ఈ టవర్ అప్పటివరకూ ఎత్తైన టవర్ గా పేరుపొందిన Washington
Monument (ఈ మానవనిర్మిత రాతి కట్టడం ఎత్తు 169 మీటర్లు..అంటే ఈఫిల్ టవర్
కట్టబోయే ఎత్తులో సగం మాత్రమే..!! వివిధ కారణాలవల్ల ఇది పూర్తవడానికి 35
ఏళ్ళకు పైగా సమయం పట్టింది. దానిలో 23 ఏళ్ళ పాటూ పని నిలిపివేశారు.)
రికార్డును అధిగమించడమే కాకుండా తన రికార్డును మరో 41 ఏళ్ల పాటూ పదిలంగా
ఉంచుకుంది. ఈఫిల్ టవర్ ని అదే షేపులో రాతితో కట్టి ఉంటే దానిబరువుకు అదే
కుప్పకూలి ఉండేది...! అందుకే Wrought Iron ని వాడి దాని బరువుని పదివేల
టన్నులకే(!!) పరిమితం చేసారు.
వికీ పీడియా సౌజన్యంతో |
Washington Monument |
ఈఫిల్ టవర్ నిర్మాణం లో ఉన్నప్పుడు తీసిన ఫోటోలూ, డ్రాయింగ్ లు కొన్ని ఈ స్లైడ్ షో లో చూడండి.
టవర్ మొదటి అంతస్తు లోని రెస్టారెంట్ |
ఎడమ నుంచి కుడికి ఆల్వా ఎడిసన్, ఈఫిల్ గారి కూతురు, ఈఫిల్ |
పైన కనిపిస్తున్నది ఈఫిల్ టవర్ వెస్ట్ పిల్లర్. ఈ పిల్లర్స్ నాలుగూ తూర్పు,పడమర ఉత్తర దక్షిణ దిశలను చూస్తూ ఉంటాయి. So the sides of Eiffel Tower are ORIENTED at an angle of 45 degrees to true north. |
మా టిక్కెట్టు... చిట్టచివరి అంతస్తుకు వెళ్ళడానికి.. |
రెండేళ్ళ నిర్మాణ కాలంలో ఒకే ఒక్క వ్యక్తి మృత్యువాత పడ్డాడట..! అలాగే తాను తయారుచేసిన పారాశూట్ ని ప్రయోగాత్మకంగా ప్రదర్శించబోయి ఆస్ట్రియా దేశస్తుడైన ఒక టైలర్ మొదటి అంతస్తు (సుమారు 60మీటర్ల ఎత్తు)నుంచి కిందకు దూకాడు. పారాశూట్ తెరుచుకోకపోవడంతో నేలకి గుద్దుకొని చనిపోయాడు. శవపరీక్ష చేస్తే తెలినదేమంటే నేలని తాకక ముందే అతని ప్రాణాలు గాల్లో కలసిపోయాయట..!! ఆ వీడియో ఇక్కడ చూడండి..
ఇంకో
చిత్రమైన సంగతి.. ఈఫిల్ టవర్ పాత ఇనప తుక్కు సామాన్లు కొనే వాళ్లకి
అమ్ముడుపోయింది. ఆశ్చర్యకరంగా నెల వ్యవధిలో రెండుసార్లు..!! విక్టర్ లస్టిగ్(Victor Lustig )
అనే ఘరానా మోసగాడు 1925 లో మొదటిసారి విజయవంతంగా అమ్మేసి డబ్బులు
పట్టుకొని ఉడాయించాడు. నెలరోజుల్లోపే మళ్ళీ పారిస్ కి వచ్చి మరోసారి అమ్మబోయే టప్పుడు అనూహ్యం గా పట్టుబడ్డాడు.
(కొంత సమాచారం వికి పీడియా సౌజన్యం తో)
Updated on Mr. SNKR's Comment