నా పారిస్ యాత్రా విశేషాల సమాహారం లో ఇది మూడవది. మిగిలినవి రెండూ ఇక్కడ చూడొచ్చు.
మేము 2011 నవంబరు లో పారిస్ వెళ్ళినప్పుడు ప్రపంచ ప్రఖ్యాత Louvre మ్యుజియం కి వెళ్లాం. అప్పుడు తీసిన ఫోటోలు ఇవి. సీన్ నది ఒడ్డున ఉన్న ఈ మ్యుసియం చాలా పెద్దది.. తీరుబాటుగా చూస్తే ఒక వారం పడుతుందేమో..!
ఆరులక్షల యాభైవేల చదరపుటడుగుల వైశాల్యం లో 35000 కళారూపాలు ఇక్కడ
ప్రదర్శనకు ఉంచారు. నాచురల్ లైట్ ని వీలైనంత మేర వాడుకోవడానికి వీలుగా భవనం
లో మండువాలూ(Court Yards) Sky Lights, Dome లు ఏర్పాటు చేసారు.
అక్కడ ప్రదర్శనకు ఉంచిన ప్రతీ వస్తువుకూ వ్రాసిన వివరణ ఫ్రెంచ్ లోనే ఉండడం తో అర్ధం కాలేదు. అయితే మ్యుజియం వాళ్ళు ఎంట్రన్సు లోనే ఒక పరికరాన్ని అందుబాటులో ఉంచారు. దానిమీద నెంబర్లు వుంటాయి. మనకి కావలసిన భాష ని సూచించే నెంబరు నొక్కి ఆ భాషలో అక్కడి వస్తువులకు సంబంధించిన విశ్లేషణ వినవచ్చు. ఇప్పుడు ఈ ఫోటోలు చూస్తోంటే ఒక్కొక్క బొమ్మకూ వివరణ తెలిస్తే ఇంకా బాగుణ్ణు కదా అనిపిస్తోంది. ప్చ్..ఏంచేస్తాం..! ప్రస్తుతానికి ఫోటోలు మాత్రం చూద్దాం.
ఫ్లాష్ సాఫ్ట్ వేర్ వాడి ఈ స్లైడ్ షో నేను మొదటిసారి చేసాను. పేర్లు, కాప్షన్లు ఎలాపెట్టాలో ఇంకా తెలియక పోవడం చేత ఫోటోలు కూడా మళ్ళీ ఇచ్చి వాటికింద కొన్ని లింకులు, వివరాలూ వ్రాసాను.
అక్కడ ప్రదర్శనకు ఉంచిన ప్రతీ వస్తువుకూ వ్రాసిన వివరణ ఫ్రెంచ్ లోనే ఉండడం తో అర్ధం కాలేదు. అయితే మ్యుజియం వాళ్ళు ఎంట్రన్సు లోనే ఒక పరికరాన్ని అందుబాటులో ఉంచారు. దానిమీద నెంబర్లు వుంటాయి. మనకి కావలసిన భాష ని సూచించే నెంబరు నొక్కి ఆ భాషలో అక్కడి వస్తువులకు సంబంధించిన విశ్లేషణ వినవచ్చు. ఇప్పుడు ఈ ఫోటోలు చూస్తోంటే ఒక్కొక్క బొమ్మకూ వివరణ తెలిస్తే ఇంకా బాగుణ్ణు కదా అనిపిస్తోంది. ప్చ్..ఏంచేస్తాం..! ప్రస్తుతానికి ఫోటోలు మాత్రం చూద్దాం.
భవనం బయటినుండి ఫోటోలు..
ఈ మెట్ల మధ్యలో కనిపిస్తున్న స్తంభం లాగా ఉన్నది నిజానికి లిఫ్టు.
వికలాంగులనీ, వృద్దులనీ క్రింద ఫ్లూర్ లోకి తేవడానికి ఈ ఏర్పాటు చేసారు. |
ఈ మోనాలిసా చితాన్ని చూడడానికి సందర్శకులందరూ చాలా ఆసక్తి చూపుతారు.. అక్కడ (అదే హాలులో) పెద్ద పెయింటింగులు ఉన్నా ఇంతచిన్న పైంటింగ్ అంత ప్రఖ్యాతి పొందడం ఆశ్చర్యమే..! |
మోనాలిసా, వికిపిడియా సౌజన్యంతో |
సీలింగ్ లో చేసిన డిజైన్లు
వీనస్ |
చిన్న పిల్లలని గ్రూపులుగా తీసుకువచ్చి అక్కడి పెయింటింగ్స్ యొక్క విశిష్టతని వివరిస్తున్నారు. |
చాలామంది ఔత్సాహిక కళాకారులు, ఈ మ్యుజియం కి వచ్చి తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకొంటున్నారు.
పైన చూపిన అయిదూ మినియేచర్ శిల్పాలు. ఒక్కొక్కదాని ఎత్తూ 18 అంగుళాలకి మించిలేదు. అయినా అద్భుతమైన శిల్పకళా విన్యాసం. ఆ శిల్పులకి జోహార్లు.
Cupid's Kiss |
పై శిల్పం యొక్క మరిన్ని అద్భుతమైన ఫోటోలు ఇక్కడ చూడండి.
ఈ మ్యుజియం కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.(వికి పిడియా సౌజన్యంతో)
ఈ మ్యుజియం కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.(వికి పిడియా సౌజన్యంతో)
No comments:
Post a Comment
🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.