Wednesday, April 11, 2012

నేను వాడిన మొట్టమొదటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ - తీపిగురుతులు

నేను వాడిన మొట్టమొదటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్:
నేను కాలేజీ లో ఉండగా వాడిన కెమెరా: యాషికా ఎలెక్ట్రో 35.

మా నాన్నగారికి ఆయన చిన్నప్పుడు ఫోటోగ్రఫి హాబీ గా వుండేది. మా ఇంట్లో ఇప్పటికీ ఆయన వాడిన ఐసోలీ కెమెరా ఉంది.  మా ఇంటిలో అద్దెకున్న వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేస్తూ ఈ కెమెరా ని వదిలేసి వెళ్ళారు. అది బాగా బూజు పట్టి, దుమ్ము కొట్టుకుపోయి ఏమీ పనికిరాకుండా వుంది. వాళ్ళని అడిగితే పనికిరాదని వదిలేశాం అన్నారు.
కానీ మా నాన్నగారు అది తప్పకుండా పని చేస్తుందని చెప్పి రిపేర్ చేయించారు. స్పేర్ పార్ట్లు వేయించి, ఫ్లాష్ కూడా ఒకటి సెట్ చేసి కానీ నేను వాడిన మొదటి కెమెరా మాత్రం ఇదే. నేను ఫోటోలు తీయడం నేర్చుకున్నదే దానిమీద. తరువాత మా మామయ్యల పెళ్ళిళ్ళకి కూడా ఫోటోలు దానితోనే తీశాను.
 ********************************************************



ఇది నేను వాడిన, నా సొంత డబ్బులతో కొనుక్కున్న మొట్టమొదటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్. CASIO డిజిటల్ డైరీ. అప్పట్లో రూ.1800 /- కి కొన్నాను. ఈ డిజిటల్ డైరీ..బ్యాక్ లిట్ స్క్రీన్ తో వచ్చేది. ఫోన్ బుక్ గా మాత్రమే కాక    Calculator , Unit  Converter, ఆర్గనైజర్ గా కూడా ఉపయోగపడేది. 
********************************************************
   
అప్పట్లో మొబైల్ ఫోన్స్ వచ్చిన కొత్త. నేను, మా Partner విజయ్ కలిసి ఈ సెకండ్ హ్యాండ్ సెట్ వాడుకొనే వాళ్ళం. ఎవరికి బయటికి వెళ్ళే పనుంటే వాళ్ళు తీసుకొని వెళతారన్న మాట ..! సైట్ కి వెళ్ళినప్పుడూ, బయట ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడూ.. !! అప్పట్లో incoming కాల్ కూడా charge  చెయ్యబడేది. అయితే ఇది జేబులో పెట్టుకుంటే పెన్ను తప్ప మరేమీ పెట్టుకోలేక పోయేవాళ్ళం.
********************************************************





ఇది పామ్ టాప్ కంప్యూటర్. మోడల్ పేరు: Palm m100. దీనికున్న మెమొరీ 8MB .  Palm అనే కంపెనీకి చెందినది. ముందర వాడిన CASIO  డిజిటల్ డైరీ కున్న 128  kB మెమరీ తో పోల్చితే ఇది చాలా ఎక్కువ.ఇది కూడా అలాంటిదే కానీ టచ్ స్క్రీన్, స్టైలస్  వాడడం చాలా స్టైల్ గా ఉండేది. పైగా ఇలాంటిది ఎవరి దగ్గరా వుండేది కాదు. చిన్నా చితకా గేమ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిలో 15 పజిల్ అని ఒక గేమ్ ఉండేది. అలాగేకంప్యూటర్ కి connect చేసి, అడ్రస్ బుక్, మొదలైనవి Sync  చెయ్యొచ్చు. అన్నిటికన్నా ఇదినాకు ప్రత్యేకమైంది ఎందుకంటే నా పెళ్ళికి gift గా  మా తమ్ముడు అమెరికా నుండి తెచ్చాడు. నాదగ్గర ఇంకా ఉంది కానీ ప్రస్తుతం  పని చెయ్యట్లేదు . దీంతో  పాటూ PALM Desk Top అని ఒక సాఫ్ట్ వేర్ కూడా ఇచ్చాడు. చాలా బాగుండేది.
********************************************************

ఇది నా ఫస్ట్ సోలో మొబైల్ ఫోను. TATA విశాఖపట్నం లో మొదట CDMA ఫోన్ లు లాంచ్ చేసినప్పుడు కొన్నాను. రు.8500/-. Samsung Flip ఫోన్. Within the city limits all incoming charges were free.City limits దాటగానే రోమింగ్ పడేది. నేను వాడినన్నాళ్ళు వాడాక  కొన్నాళ్ళు మా నాన్నగారు వాడారు. తరువాత మాపిల్లలు వా(ఆ)డారు. ప్రస్తుతం వాళ్ళ బొమ్మల్లోనే ఎక్కడో ఉండొచ్చు. లేదా పారేశారో..!

(ఈ మోడల్ ఫోనుకి  ఫోటో ఇంకేదీ దొరకలేదు. )
********************************************************
ఇది కూడా మా తమ్ముడే పంపాడు. నా ఫస్ట్ కెమెరా ఫోన్. VGA Camera ఉండేది. చాలా చిన్నగా ముద్దుగా వుండేది.  అరచేతిలో ఇమిడిపోయేది బుజ్జిముండ.

********************************************************
నా మొట్టమొదటి లాప్ టాప్ అమెరికా నుంచీ తెప్పించిందే..! కానీ ఒకసారి రిపైర్ వచ్చాక దాని స్పెర్స్ దొరకడం చాలా కష్టం అయిపొయింది.   
********************************************************

నా ఆల్ టైం favourite ఈ ఫోను. కొన్నప్పటి ఖరీదు రు. రు.22,000/-. నంబర్స్ కనిపిస్తున్న flap ని తెరిస్తే టచ్ స్క్రీన్ activate అవుతుంది. ఒకే ఒక్క మైనస్ ఏమిటంటే.. దాని బరువు. దాని సైజు కి కొంచం ఓవర్ వెయిట్. పైగా qwerty keyboard కూడా వుంటుంది.  ఆ flap తీసేసి కేవలం టచ్ ఫోన్ గా మాత్రమే వాడొచ్చు. విత్ qwerty keyboard . ఇప్పుడు mp3 ప్లేయర్ గా ఉపయోగ పడుతోంది. పాపం ఫోన్ గా కూడా పని చేస్తుంది. కానీ మేమే దానికి కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చేశాం. 
********************************************************
ఇప్పుడు ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లు సర్వసాధారణం అయిపోయాయి కానీ వాటి వాడకం మొదలైన కొత్తలో మనం వాడిన వస్తువులు ఎప్పుడూ మనకు తీపి గుర్తులుగా మిగుల్తాయి.. కదూ..!!

1 comment:

  1. కొంటాం...వాడతాము కాని మీరు ఆ జ్ఞాపకాలను అందంగా జ్ఞాపకం పెట్టుకుని మరింత అందంగా శబ్దీకరించడం .. చిత్రీకరించడం.. అభినందనీయం.. చాలా చక్కగా అందించారు.. అభినందనలు.

    ReplyDelete

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)