రామాయణ మహాకావ్యం ఎన్ని సార్లు విన్నావినాలనిపిస్తుంది. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ చదవాలని పిస్తుంది. ఆ కావ్య మాధుర్యం అలాంటిది. సంస్కృతం లో వాల్మీకి మహర్షి వ్రాసిన ఈ కావ్యం, వివిధ భాషలలోకి అనువదించబడింది. రంగనాధ రామాయణం, భాస్కర రామాయణం, మొల్ల రామాయణం, విశ్వనాథ వారి రామాయణ కల్ప వృక్షం...ఇలా చాలా మంది రామాయణాన్ని తమ శైలి లో రచించి చరితార్ధులైనారు.
ఈ బొమ్మ నేను గీసిందే..! ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు..!! |
అలాగే రామాయణ కావ్య రచనలో విన్యాసాలు చేసిన కవులు కూడా ఉన్నారు. సాహిత్య జగత్తు లో శాశ్వత స్థానాన్ని పొందిన నిరోష్ఠ్య రామాయణం అను దశరథ రాజ నందన చరిత్ర (గమనించండి ఈ పేరు పలికేటపుడు పెదవులు కలవటం లేదు.. అదే ఈ కావ్యం ప్రత్యేకత -నిర్+ఓష్ఠ్యము (పెదవుల సాయంతో పలికే పదాలు లేనిది), రాఘవ పాండవీయం (ద్వ్యర్థి కావ్యం, ఈ పద్యాలలో రామాయణార్థం, భారతార్థమూ కూడా ఉంటాయట), యాదవ రాఘవ పాండవీయం (ముందర దానిలాగే ఇది త్యర్థి కావ్యం) లాంటివి ఈ కోవకే చెందుతాయి. (ఈ పుస్తకాలు కావలసిన వారు లింకులు నొక్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు)
అలాకాక రామాయణ మహా కావ్యం మొత్తాన్ని క్లుప్తంగా చాలా తక్కువ పద్యాలలోనో, కొన్ని శ్లోకాలలోనో, వ్రాయబడినవి కూడా పూర్తి కావ్యమంత రమ్యం గానూ ఉండడం అవి చదివిన ప్రతి ఒక్కరికీ అనుభవం లోకి వచ్చే విషయమే. అలాంటి సంక్షిప్త రామాయణాలను ఒక సారి తలచుకోవడమే ఈ టపా ఉద్దేశ్యం. (వెనుకటికెవరో మూడుముక్కల్లో రామాయణం చెప్తానని 'కట్టే..! కొట్టే..! తెచ్చే..!' అన్నాడట ఇక్కడ చెప్పబోయేది అలాంటిది కాదులెండి.)
వాల్మీకి మహర్షి కొన్ని లక్షణాలను నారదుడి ముందు ఏకరువు పెట్టి ఆ లక్షణాలతో మూర్తీభవించిన వ్యక్తి ఈ కాలం లో ఎవరైనా వున్నారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా నారదుడు రామాయణాన్ని క్లుప్తంగా వాల్మీకి మహర్షికి ఉపదేశించి శ్రీ రామ కథను విస్తరించి వ్రాయమని చెబుతాడు. అదే నూరు శ్లోకాలతో కూడిన మొట్ట మొదటి సంక్షిప్త రామాయణం. పూర్తి కావ్యం లో ఇరవై నాలుగు వేలకు పైగా శ్లోకాలున్నాయట.
antaryamin.wordpress.com సౌజన్యంతో |
ఇక ఇంకొన్నిచూద్దాం.
********************************
ఏక శ్లోకీ రామాయణం:
(దీని మూలం ఏదో, ఎవరు వ్రాశారో తెలియలేదు)ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనమ్ |
వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణమ్ ||
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనమ్ |
పశ్చాద్రావణకుంభకర్ణహననం చేతద్ధి రామాయణమ్ ||
********************************
నామ రామాయణం:
నూట ఎనిమిది సార్లు రామ నామం వచ్చేటట్లు సంస్కృతంలో శ్రీ లక్ష్మణా చార్యుల వారిచే వ్రాయబడింది.ఈ లింక్ నొక్కి ఆ రచన యొక్క ప్రతిపదార్థ తాత్పర్యాలను చూడండి.
లక్ష్మణాచార్య కృత నామ రామాయణం - తాత్పర్యము
********************************
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గళం నుంచీ రాగమాలికగా జాలువారిన ఇంకొక కీర్తన
భావయామి రఘు రామం భవ్య సుగుణ ఆరామం - ఈ కీర్తన మహారాజ స్వాతి తిరునాళ్ రచన. దీనిలో ఆరు చరణాలలో ఆరు కాండలు వర్ణించ బడ్డాయి. పల్లవి సావేరి లోనూ, చరణాలు వరుసగా నాటకురంజి, ధన్యాసి, మోహన , ముఖారి, పూర్వికల్యాణి, మధ్యమావతి రాగాలలో స్వరపరచ బడ్డాయి.
ఒక పుస్తకం వెనుక అట్ట మీద ప్రచురితమైంది ఈ సీస మాలికా రామాయణం. ఎవరు వ్రాశారో తెలీదు. అది మా పెదనాన్నగారు వ్రాసుకొని దాచి ఉంచారు. (నా టైపింగ్ లో ఏమైనా తప్పులుంటే తెలిసిన వారు సరిదిద్దవచ్చు.)
సీ. భాను వంశమందు ప్రభుడవై జన్మించి
అఖిల విద్యలెల్ల నభ్యసించి
తాటకి మర్దించి తపసి యాగము గాచి
శిలను శాపము మాన్పి స్త్రీని జేసి
శివుని శాపము విరచి సీతను పెండ్లాడి
పరశురాముని త్రాణ భంగపరచి
తండ్రి వాక్యము కొరకు తమ్మునితోగూడి
వైదేహి తోడను వనము కరగి
ఖర దూషణాదుల ఖండించి రాక్షస
మారీచ మృగముల మడియ జేసి
లంకకు రాజైన రావణాసురుడొచ్చి
సతిని గొని పోవంగ సంభ్రముడిగి
సుగ్రీవు కనుగొని సుముఖుడవై యపుడు
వాలిని వధియించి వరుసతోడ
రాజ్య మాతనికిచ్చి రాజుగా చేబట్టి
కిష్కింధ యేలించి కీర్తి వడసి
గీ. వాయు సుతు చేత జానకి వార్త దెలిసి తర్లి సేతువు బంధించి త్వరగ దాటి
రావణానుజ కభయంబు రయము నొసగి ఘోర రణమందు రావణు కూలవేసి
అతని తమ్ముని రాజుగా నమరజేసి సతిని చేకొని సురలెల్ల సన్నుతింప
రాజ్యమేలితి పట్టాభి రామువగుచు రామ తారక దశరధ రాజ తనయ..!
భావయామి రఘు రామం భవ్య సుగుణ ఆరామం - ఈ కీర్తన మహారాజ స్వాతి తిరునాళ్ రచన. దీనిలో ఆరు చరణాలలో ఆరు కాండలు వర్ణించ బడ్డాయి. పల్లవి సావేరి లోనూ, చరణాలు వరుసగా నాటకురంజి, ధన్యాసి, మోహన , ముఖారి, పూర్వికల్యాణి, మధ్యమావతి రాగాలలో స్వరపరచ బడ్డాయి.
********************************
సీ. భాను వంశమందు ప్రభుడవై జన్మించి
అఖిల విద్యలెల్ల నభ్యసించి
orgvalmikiramayana.blogspot.com సౌజన్యంతో |
శిలను శాపము మాన్పి స్త్రీని జేసి
శివుని శాపము విరచి సీతను పెండ్లాడి
పరశురాముని త్రాణ భంగపరచి
తండ్రి వాక్యము కొరకు తమ్మునితోగూడి
వైదేహి తోడను వనము కరగి
ఖర దూషణాదుల ఖండించి రాక్షస
మారీచ మృగముల మడియ జేసి
లంకకు రాజైన రావణాసురుడొచ్చి
సతిని గొని పోవంగ సంభ్రముడిగి
సుగ్రీవు కనుగొని సుముఖుడవై యపుడు
వాలిని వధియించి వరుసతోడ
రాజ్య మాతనికిచ్చి రాజుగా చేబట్టి
కిష్కింధ యేలించి కీర్తి వడసి
గీ. వాయు సుతు చేత జానకి వార్త దెలిసి తర్లి సేతువు బంధించి త్వరగ దాటి
రావణానుజ కభయంబు రయము నొసగి ఘోర రణమందు రావణు కూలవేసి
అతని తమ్ముని రాజుగా నమరజేసి సతిని చేకొని సురలెల్ల సన్నుతింప
రాజ్యమేలితి పట్టాభి రామువగుచు రామ తారక దశరధ రాజ తనయ..!
********************************
ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు
చేరి వినవె శౌరి చరితము గౌరీ
సుకుమారి గిరివర కుమారి.. అంటూ సాగే ఈ కీర్తన బాలకాండను వర్ణిస్తుంది.
చేరి వినవె శౌరి, చరితము-గౌరి, సుకుమారి గిరివరకుమారీ
పై లింకులో ఆ కీర్తన పూర్తి పాఠం, అలాగే దాని విశేషాలూ చూడొచ్చు
శ్రీసద్గుణాన్వితా సీతాద్రిసుత వినవే - కౌశేయ, వాసున... ( అయోధ్య కాండ) ఇలా అన్ని కాండలూ వర్ణించబడ్డాయి.)

ఇక సినిమా పాటల విషయానికొస్తే 'లవకుశ' లో రామాయణ కథ లవకుశులు పాడిన వరుస పాటల్లో రామ కథను వినరయ్యా.. అంటూ బాలకాండ తో మొదలుపెట్టి, శ్రీ రామ పట్టాభిషేకం వరకూ కనిపిస్తుంది. కొన్ని పాటలు కొసరాజు, సదాశివబ్రహ్మం గార్లు వ్రాసినా రామాయణ కథా గీతాలు మాత్రం సముద్రాల రాఘవాచార్య గారే వ్రాశారు. రామాయణ వర్ణన తో వచ్చిన అన్ని సినిమా పాటల లోనూ ఇవి తలామానికం అనడం లో ఎలాంటి సందేహమూ లేదు. సముద్రాల వారి సాహిత్యం, ఘంటసాల గారి సంగీతం, సుశీల, పి. లీల గార్ల గాత్రం ఈ పాటలను అజరామరం చేశాయి. ఈ లింక్ లో ఆపాటలు చదవొచ్చు.., వినొచ్చు..!!
http://geetalu.blogspot.in/search/label/లవకుశ
ఇవి కాక రాముడి పుట్టుకనొక్కటే వర్ణించే కీర్తన మరొకటి వుంది. అది ప్రయాగ రంగాదాసుగారి కీర్తన. వీరు శ్రీ బాలమురళికృష్ణ తాతగారు. అది ఈ క్రింది లింక్ లో చూడవచ్చు.
రాముడుద్భవించినాడు రఘుకులంబున (గాత్రం: డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ)
********************************
గుడిలో ప్రసాదం పెట్టేటప్పుడు ఒకసారి జీడిపలుకులు తగుల్తాయి. మరొకసారి ఏలకుల ఘుమ ఘుమలు, మరొక సారి కిస్మిస్ లు, మరొకసారి కమ్మటి నేతి వాసన... ఇలా దేని రుచి దానిదే కదా...!! అన్నిటిలోనూ ప్రసాదపు అసలురుచి అయిన తీపి మారదు. కలకండ ఎంత కొంచం తిన్నా దాని తీయదనంలో ఎటువంటి లోటూ ఉండదుకదా..!! అలాగే రామాయణ మహా కావ్యాన్ని పూర్తిగా చదువలేని వారికి ఈ సంక్షిప్త రామాయణాలు మొత్తం కావ్యాన్ని చదివిన అనుభూతిని కలిగిస్తాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కో రకమైన అందం. ఆ రుచి అనుభవించి తీరవలసిందే..!
తెలుగులో మరింకేమైనా సంక్షిప్త రామాయణాలు ఇంకెవరికైనా తెలిస్తే అందరితో పంచుకోవలసినది గా మనవి.
********************************
శ్లో. కూజంతం రామ రామేతి మథురం మథురాక్షరం |
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం ||
శ్లో. శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే ||
( పైన నేను వాడిన బ్లాగు లింకుల యజమానులకి పేరు పేరునా ధన్యవాదాలు. ఆయా విషయాలమీద వారి వివరణ, దానికి వారు పడ్డ శ్రమ రెండూ మెచ్చుకోదగ్గవే. ..!)

రాదేమాధవి గారూ ,
ReplyDeleteరామదాహార్తులకు అమృతాన్ని ఇచ్చారు .ధన్యవాదాలు
nice compilation
ReplyDeleteమట్టి బలపం, పురాణపండ ఫణి గార్లకు ధన్యవాదాలు.
ReplyDelete"రా" "మా"... అయ్య పలుకుతాడు పెదాల అవసరం లేకుండా.. మరి అమ్మ అదే "మా" పలకదే.. బాగుంది.. ఇది నేను డౌన్ లోడ్ చేసి తప్పక చదువుతాను.. నిర్వచనోత్తర రామాయణం, చంపూ రామాయాణం ఈ కోవకు చెందినవేమో అంటే ఒక ప్రత్యేకతతో కూడినవేమో కదా... చాలా మంచి సమాచారము అందించారు... సందర్భం కాదేమో కాని మా తండ్రిగారు తులసీ రామాయణానికి తెలుగు వచనానువాదము చేసారు.. మూడుసార్లు ముద్రించబడింది.. మీతో ఆనందం పంచుకోవడానికి వ్రాసాను. తప్పైతే అన్యథా భావించకండి.
ReplyDelete