మా అన్నయ్య శ్రీ ఆర్ శంకర్ వ్రాసిన కవిత : స్నేహం
(
సవరణలు,
సూచనలకు ఆహ్వానం)
కుల మతాలకతీతమై
మనసులలో మమేకమై
మాధుర్య సుగంధాలను
విరాజిల్లే పరిమళ
పుష్పం స్నేహం
బంధాలను బంధుత్వాలను
చిన్నా పెద్ద తారతమ్యాలను
అధిగమించిన మానవుని
మానస పుత్రిక స్నేహం
నా అన్నవారు లేని సమయాన
నేనున్నానన్న భరోసా ఇచ్చి
దాపరికాలకు తావులేదని చాటిన
అభయ హస్తం స్నేహం
హద్దులు ఎల్లలు ఎరుగని స్నేహం
విశ్వశాంతికి జనియించిన ఏకైక మూలకం
ఆదీ అంతం లేని శ్వేత
వర్ణ కుసుమం
హృదయాంతర క్షేత్రం లో విరబూసిన ఆమని
స్నేహం
కాలం కొలవలేని ఎన్నో వసంతాలను చూసి
భవిష్యత్తులో మరెన్నో వసంతాలను వీక్షించే
చక్కటి అనుభూతి స్నేహం..
అపార్ధాలూ అపోహలూ
తాత్కాలికమే అని హితవు పలికి
ఆచంద్ర తారార్కం నిలిచేది స్నేహం..
పై కవితకి కి నేను చేసిన సవరణలు..
కుల
మతాలకే అతీతమై
మనసులతో
మమేకమై
సుగంధ
మధురిమల్ని పంచే
పరిమళ
పుష్పం స్నేహం..
బంధాలూ
బంధుత్వాలన్నీ
చిన్నా
పెద్దా తేడాలన్నీ
అధిగమించిన
మానవుడా
నీ
మానస పుత్రిక స్నేహం
నాఅన్నవారే
టోకరా ఇస్తే
నేనున్నానని
భరోసా ఇచ్చి
దాపరికాలే
వద్దని చాటే
అభయ
హస్తం స్నేహం..
హద్దులు
ఎల్లలు ఎరుగని స్నేహం
విశ్వశాంతి
కేకైక మూలకం
ఇక్కడినుంచీ నాకు సవరణలు తట్టలేదు. అందుకే యధా తథంగా ఉంచేశాను.
ఆదీ అంతం లేని శ్వేత వర్ణ కుసుమం
హృదయాంతర క్షేత్రం లో విరబూసిన ఆమని స్నేహం
కాలం కొలవలేని ఎన్నో వసంతాలను చూసి
భవిష్యత్తులో మరెన్నో వసంతాలను వీక్షించే
చక్కటి అనుభూతి స్నేహం..
అపార్ధాలూ అపోహలూ
తాత్కాలికమే అని హితవు పలికి
ఆచంద్ర తారార్కం నిలిచేది స్నేహం..
మిత్రులెవరైనా ఇంకేమైనా సలహాలూ సూచనలూ ఇవ్వదలిస్తే వారికి మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం.